logo
Updated : 22 Aug 2021 07:46 IST

AP News: ప్రేమ పేరిట యువతి నగ్నచిత్రాల సేకరణ.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌

ఇద్దరు యువకుల అరెస్టు


రోహిత్‌కుమార్‌                దండగల గణేష్‌

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: చదువుకునేందుకు బిహార్‌ నుంచి వచ్చాడు. విజయవాడలోని ఒక ప్రముఖ కళాశాలలో డిగ్రీ చదువుతూ ప్రేమిస్తున్నానంటూ నగరానికి చెందిన ఒక యువతి వెంటపడ్డాడు. ఆమెతో మాటలు కలిపాడు. నమ్మించి నగ్న చిత్రాలు, వీడియోలు సంపాదించాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అతనిని దూరం పెట్టింది. జీర్ణించుకోలేకపోయిన యువకుడు ఆమె నుంచి సేకరించిన నగ్న చిత్రాలు, వీడియోలను స్నేహితుడి సాయంతో యువతి పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా తెరిచి పెట్టాడు. పలు సామాజిక మాధ్యమాల్లోనూ వాటిని పోస్ట్‌ చేశాడు. ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు బిహార్‌కు చెందిన రోహిత్‌కుమార్‌, కృష్ణలంకకు చెందిన దండగల గణేష్‌ను అరెస్టు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఏ సెల్‌ఫోన్‌తో నకిలీ ఖాతా సృష్టించారో గుర్తించారు. కృష్ణలంకకు చెందిన గణేష్‌ను అదుపులోకి తీసుకోవడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వారి వద్ద నుంచి నకిలీ ఖాతా సృష్టించేందుకు వినియోగించిన సెల్‌ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌ విధించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని