logo
Updated : 27 Sep 2021 10:18 IST

Crime News: చీకట్లో కలిసిపోయిన యువకుల ప్రాణాలు

కానరాని ప్రమాద హెచ్చరిక సూచికలు

సింహాచలం, రాజు, రమణ (పాత చిత్రాలు)

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : కండ్రిక-పాతపాడు రహదారిలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ప్రమాద ప్రాంతాన్ని నున్న గ్రామీణ, పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం పరిశీలించారు. ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడపడం ఓ కారణంగా తేల్చినప్పటికీ, ప్రమాద స్థలంలో ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు లేవు. ఇబ్రహీంపట్నం-గుండుకొలను ఆరు వరుసల జాతీయ రహదారి పనుల్లో భాగంగా పాతపాడు-కండ్రిక రహదారిపై అండర్‌ పాసింగ్‌ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ద్విచక్రవాహనంపై పాతపాడు వైపు నుంచి వస్తున్న యువకులు.. ఇనుప కడ్డీలను ఢీకొట్టి మృత్యువాత పడ్డారు. అండర్‌ పాస్‌ వంతెన నిర్మాణం నిమిత్తం దారి మళ్లించిన అధికారులు.. రాత్రి సమయంలో కనిపించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. వంతెనకు ఇరువైపులా బారికేడ్లు, కనీసం రేడియం రంగు ప్లాస్టర్‌ స్టిక్కర్లు లేవు. దీనికి తోడుగా విద్యుత్తు దీపాలు లేకపోవడంతో చిమ్మ చీకటి నెలకొంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిలో వీధి దీపాలు వేయాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని, అవి ఉంటే యువకులు ప్రాణాలతో ఉండేవారని పలువురు పేర్కొంటున్నారు.

ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద కానరాని బారికేడ్లు, ప్రమాద హెచ్చరిక సంకేతాలు

వాంబేకాలనీలో విషాద ఛాయలు

ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురూ వాంబేకాలనీ వాసులే. పైగా సమీప బంధువులు కావడంతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతులు నందుపల్లి రాజు(19), నందుపల్లి రమణ(35)లు ఒకే కుటుంబంలో వ్యక్తులు. రమణ సోదరుడి కుమారుడు రాజు. బాధిత కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం విశాఖ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. రమణకు భార్య, ఒక కుమారుడు ఉండగా, రాజు ఇంటర్మీడియట్‌ వరకు చదువుకుని ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుకునేందుకు సిద్ధపడుతున్నాడు. మరో మృతుడు సింహాచలంకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వంట మేస్త్రీలుగా జీవనం సాగించే రమణ, సింహాచలంలు పెద్దగా ఎప్పుడూ బయటకు వెళ్లే వారు కాదని, ఎందుకు వెళ్లారో... ఎందుకు ప్రమాదం జరిగి మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లారో అంటూ కుటుంబసభ్యులు రోధిస్తున్నారు. బాధితుల అశ్రునయనాల మధ్య ముగ్గురి అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని