logo
Updated : 18 Nov 2021 10:52 IST

స్నేహితుడి ఖాతా ఖాళీ : యువకుడు కటాకటాల్లోకి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: స్నేహితుడి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌కు సంబంధించి యూపీఐ కోడ్‌ తెలుసుకొని.. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు దొంగిలించి రూ.1.65 లక్షలు కాజేసిన యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రాము(28) ఉద్యోగావకాశాల కోసం హైదరాబాద్‌ వచ్చి, ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. అక్కడ మరో యువకుడు పరిచయమయ్యాడు. నెల జీతంతో తాను ఊహించుకున్న జీవితం అనుభవించలేనని భావించిన రాము ఆన్‌లైన్‌లో గుర్రం రేసులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో స్నేహితుడు హాస్టల్‌ గదిలో నిద్రిస్తుండగా.. అతని క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు తస్కరించి, సుమారు రూ.1.65 లక్షలు బిట్‌ 365 యాప్‌లో గుర్రం రేసులపై పెట్టాడు. తన ఖాతాలోంచి రూ.1.65 లక్షలు పోయాయని గుర్తించిన బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు మొదలు పెట్టి.. బ్యాంక్‌ లావాదేవీల ఆధారంగా రాము కొట్టేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని కృష్ణా జిల్లాకు వెళ్లి అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చి, రిమాండ్‌కు తరలించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని