logo
Published : 27 Nov 2021 03:40 IST

మద్యం అనధికార విక్రయాల కట్టడికి బృందాలు

సమావేశంలో పాల్గొన్న బిందుమాధవ్‌, ఈఎస్‌ చంద్రశేఖరరెడ్డి

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో మద్యం అనధికార విక్రయాలు, నాటుసారా తయారీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) జాయింట్‌ డైరెక్టర్‌ బిందు మాధవ్‌ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నరసరావుపేట ఎక్సైజ్‌ డివిజన్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో తెలంగాణా, గోవా తదితర రాష్ట్రాలకు చెందిన మద్యం భారీగా  పట్టుకున్నామని నరసరావుపేట డివిజన్‌లో అత్యధికంగా మద్యం, వాహనాలు సీజ్‌ చేశామన్నారు. ఇతర రాష్ట్రాల మద్యం నియంత్రణకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. నాటుసారా తదితర అక్రమ వ్యాపారం చేసేవారు మూడుసార్లు మించి పట్టుపడితే అలాంటి వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా సీజ్‌ చేసిన వాహనాలను రిలీజ్‌ చేసేందుకు ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారన్నారు. గతంలో ఉన్న ఎక్సైజ్‌ శాఖను రెండుగా విభజించడంతో పూర్తిస్థాయిలో సెబ్‌లో సిబ్బంది లేరన్నారు. ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. ఈఎస్‌ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని