కాలువలో గల్లంతైన విద్యార్థి మృతి
విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీస్తున్న మత్స్యకారులు
బాపట్ల, న్యూస్టుడే: సహచర విద్యార్థులతో కలిసి మరుప్రోలువారిపాలెం వద్ద పేరలి కాలువలో రెండ్రోజుల క్రితం ఈతకు వెళ్లి గల్లంతైన పట్టణానికి చెందిన విద్యార్థి అంబటి వికాస్(11) మృతి చెందాడు. గల్లంతైన విద్యార్థి ఆచూకీ కోసం స్థానిక మత్స్యకారుల సహకారంతో రెండ్రోజులుగా కాలువలో పోలీసులు గాలిస్తున్నారు. ఆదర్శనగర్ వంతెన నుంచి పొగురు వైపు రెండు కి.మీ. దూరంలో కాలువలో ఉన్న విద్యార్థి మృతదేహాన్ని శుక్రవారం గుర్తించి పడవలో మత్స్యకారులు తీసుకువచ్చారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాపట్ల గ్రామీణ ఎస్సై వెంకట ప్రసాద్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.