గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు
గుంటూరు రైల్వే, న్యూస్టుడే: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-అగర్తల-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు ద.మ.రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి అగర్తాల వెళ్లే ప్రత్యేక రైలు(07030) ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు ప్రతి సోమవారం సికింద్రాబాద్లో 16.35 గంటలకు బయలుదేరి గుంటూరు 21.10, విజయవాడ 22.05, అగర్తల గురువారం 03.00 గంటలకు చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు(07029) డిసెంబరు 3 నుంచి ఫిబ్రవరి 4 వరకు ప్రతి శుక్రవారం అగర్తలలో 06.10 గంటలకు బయలుదేరి ఆదివారం విజయవాడ 07.20, గుంటూరు 08.35, సికింద్రాబాద్ 14.50 గంటలకు చేరుతుంది. అదేవిధంగా నర్సపూర్- సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను డిసెంబరు 5, 12, 19, 26 తేదీల్లో నర్సపూర్లో 18.00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07455), విజయవాడ 21.40, గుంటూరు 22.40, సత్తెనపల్లి 23.23, పిడుగురాళ్ల 23.55, మిర్యాలగూడ 00.30, నల్గొండ 01.03, సికింద్రాబాద్ 04.10 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే ఈ రైలు(07456) డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో సికింద్రాబాద్లో 22.55 గంటలకు బయలుదేరి నల్గొండ 00.45, మిర్యాలగూడ 01.15, పిడుగురాళ్ల 02.00, సత్తెనపల్లి 02.30, గుంటూరు 04.15, విజయవాడ 05.50 గంటలకు చేరుతుంది.