రూ.1500 కోట్లు కొట్టేసే ప్రయత్నం
నారా లోకేశ్ ఆరోపణ
నగర వీధుల్లో కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా వెళుతున్న లోకేశ్
మంగళగిరి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి పేదలకు పలు ప్రభుత్వాలు ఇచ్చిన పక్కా గృహాలను, రిజిస్ట్రేషన్ పేరుతో వారి నుంచి రూ.1500 కోట్లు కొట్టేసేందకు సీఎం జగన్మోహన్రెడ్డి స్కెచ్ వేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. నగరంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన విస్తృతంగా పర్యటించారు. సుమారు 8 గంటల పాటు కాలినడక పాతమంగళగిరి, దళితవాడలో తిరిగిన ఆయన ఇంటింటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా పేదల కోసం నిర్మించి ఇళ్లు ఇవ్వటం లేదని పలువురు ఆయన దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన తెదేపా అధికారంలో వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామన్నారు. అనంతరం చిరు వ్యాపారులకు ఉచితంగా నాలుగు చక్రాల తోపుడు బండ్లు పంపిణీ చేశారు. వివిధ కారణాలతో మరణించిన వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చేనేత మగ్గాల షెడ్లకు వెళ్లి వారి జీవన స్థితి అడిగి తెలుసుకున్నారు. చిన్న హోటల్ వద్ద స్థానికులతో కలిసి టీ సేవించారు. అంతకు ముందు లోకేశ్‌కి రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద పార్టీ కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీతో స్వాగతం పలికారు. తదుపరి ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలామాల వేశారు. పాతమంగళగిరిలో అడుగుడుగునా మహిళలు హారతులు పట్టి తిలకం దిద్దారు. చిన్నారులు, యువతులు పోటాపోటీగా సెల్ఫీలు దిగారు.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.