logo
Published : 27/11/2021 03:40 IST

వరద బాధితులను ఆదుకోవడం అందరి బాధ్యత

వరద బాధితులకు అందించనున్న నిత్యావసరాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో తుపానుతో నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. తుపానుతో నష్టపోయిన బాధితులకు సహాయార్థం జిల్లా నుంచి నిత్యావసరాలను నెల్లూరు జిల్లాకు తరలించే వాహనాన్ని జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు, దాతలు, స్వచ్ఛంద ఐటీసీ, ట్రిపుల్‌ ఎక్స్‌, ఏపీ దాల్‌మిల్లర్లు, స్పిన్నింగ్‌ మిల్లు, ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంస్థలు వరద బాధితుల సహాయార్థం ముందుకొచ్చాయన్నారు. రూ.50 లక్షల విలువైన పది రకాల నిత్యావసర సరకులను నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు పంపిస్తున్నామన్నారు. కిలో కందిపప్పు, గోధుమరవ్వ, పంచదార, ఉప్పు, బియ్యపురవ్వ, కారం, పసుపు, తాలింపులు, వంటనూనెలతో కిట్టును రూపొందించామన్నారు. ఒక్కో కిట్టు ధర రూ.450 అని తెలిపారు. మూడు వేల కిట్లను నెల్లూరు జిల్లాకు పంపుతున్నామని, రెండు రోజుల్లో చిత్తూరు, కడప జిల్లాల వరద బాధితులకూ పంపుతామన్నారు. కార్యక్రమంలో భారతీ సోప్‌ వర్క్స్‌ అధినేత అరుణాచల మాణిక్యవేల్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, పలువురు దాతలు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ టి.శివరామప్రసాద్‌, మెప్మా పీడీ వి.వి.నారాయణ, పౌరసరఫరాల సంస్థ ఏఎం దుర్గాప్రసాద్‌, తూర్పు మండల తహసీల్దార్‌ ఎస్‌.శ్రీకాంత్‌, సహాయ ఫుడ్‌ కంట్రోలర్‌ గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని