logo
Published : 27/11/2021 03:40 IST

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: స్థానికసంస్థల నియోజకవర్గం నుంచి శాసనమండలికి నిర్వహించిన ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇద్దరు అభ్యర్థులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. వాటిని రిటర్నింగ్‌ అధికారులు స్క్రూట్నీ చేసి ఆమోదించారు. శుక్రవారం మధ్యాహ్నంతో ఉపసంహరణ సమయం ముగియడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒక్కొక్కరే పోటీలో ఉండటంతో వారిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా రిటర్నింగ్‌ అధికారి, సంయుక్త కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అభ్యర్థులిద్దరికి డిక్లరేషన్‌ను జేసీ దినేష్‌కుమార్‌ అందించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ సీనియర్‌ నాయకుడిగా తనను మండలిలోకి మరోసారి తీసుకొచ్చారని, ప్రజోపయోగమైన కార్యక్రమాల నిర్వహణకు కృషి చేస్తానన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని