logo
Published : 27/11/2021 03:40 IST

ప్రొబేషన్‌లోనే వసూళ్ల పర్వం

అనిశాకు చిక్కిన సచివాలయ కార్యదర్శి

పట్టుబడిన నగదుతో శ్రీనివాసరావు

ఆ యువకుడు.. తల్లిదండ్రుల రెక్కల కష్టంతో ఉన్నత విద్య చదివాడు. కష్టపడి చదివి వార్డు సచివాలయ   కార్యదర్శి ఉద్యోగం సాధించాడు. ఉద్యోగం చేరి ఇంకా ప్రొబేషనరీ కాలం కూడా పూర్తి కాలేదు. కానీ.. ఉద్యోగంలో చేరిన మొదలు వసూళ్లకు ఉపక్రమించాడు. ఉన్నతాధికారులు వద్దని వారించినా పెడచెవిన పెట్టాడు.  చివరికి శుక్రవారం రూ.3 వేలు తీసుకుంటూ   అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు చిక్కి..  కటకటాలపాలయ్యాడు.

చిలకలూరిపేట పట్టణం, గ్రామీణ, న్యూస్‌టుడే: చిలకలూరిపేట పట్టణం ఎన్టీఆర్‌ కాలనీ 1వ వార్డు సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి కొలిశెట్టి శ్రీనివాసరావు ఒకరి నుంచి రూ.3 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం అనిశా అధికారులకు పట్టుబడ్డారు. గుంటూరు ఏసీబీ ఇన్‌ఛార్జి డీఎస్పీ బి.శ్రీనివాస్‌ అందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన రాజేష్‌కు 2016లో కుమారుడు జన్మించాడు. చిన్నారి జనన ధ్రువపత్రం కోసం 7 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. వార్డు రెవెన్యూ కార్యదర్శి కొలిశెట్టి శ్రీనివాసరావు సంబంధిత తహశీల్దార్‌ లాగిన్‌కి పంపేందుకు రూ.5 వేలు అడిగారు. రాజేష్‌ రూ.3 వేలు ఇస్తానని ఆయనతో ఒప్పందం కుదుర్చుకుని అనిశా అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజేష్‌ నుంచి రూ.3 వేలు లంచం తీసుకుంటున్న వార్డు రెవెన్యూ కార్యదర్శిని కార్యాలయంలోనే అనిశా అధికారులు పట్టుకుని అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్లు రవిబాబు, శ్రీధర్‌, నాగరాజు, అంజిబాబు, సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంటెక్‌ చదివి.. అవినీతికి పాల్పడి..
అనిశా అధికారులకు శుక్రవారం పట్టుబడిన వార్డు సచివాలయ రెవెన్యూ కార్యదర్శి శ్రీనివాసరావు స్వగ్రామం నాదెండ్ల మండలం చిరుమామిళ్ల. తల్లిదండ్రులు చిన్న హోటల్‌ నడుపుతూ పిల్లలిద్దరినీ కష్టపడి ఎంటెక్‌ చదివించారు. కుమారుల్లో ఒకరైన శ్రీనివాసరావు వార్డు సచివాలయ రెవెన్యూ కార్యదర్శిగా ఎంపికయ్యాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల నుంచే ఏ పని చేయాలన్నా లంచం తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానిక అధికారుల పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని చెబుతున్నారు. చివరకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని