Published : 27 Nov 2021 03:40 IST
సమన్యాయం అందించడమే రాజ్యాంగ లక్ష్యం
అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న కలెక్టర్ వివేక్‌యాదవ్, జేసీ ఏఎస్ దినేష్‌కుమార్
కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్‌టుడే: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్ఠమైన లిఖిత రాజ్యాంగం అని, దీనిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులతో రాజ్యాంగ పీఠికను అధికారులందరితోనూ చదివించారు. జేసీ ఏఎస్ దినేష్‌కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags :