logo
Published : 27 Nov 2021 04:13 IST

అధికార పార్టీలోరాజీనామాల కలకలం

పామర్తి శ్రీనివాసరావు

మైలవరం, న్యూస్‌టుడే: మైలవరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌, వైకాపా మండల కన్వీనర్‌ పదవులకు పామర్తి శ్రీనివాసరావు శుక్రవారం రాజీనామా చేశారు. ఆయనతోపాటు వైకాపా మండల కార్యదర్శి ఎర్రగోపుల రాంబాబు సైతం రాజీనామా చేశారు. ఇద్దరూ ఈ మేరకు లేఖలు రాసి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు పంపుతూ.. మీడియాకు కూడా తెలియజేశారు. వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న శ్రీనివాసరావు రాజీనామా వ్యవహారం అధికార పార్టీలో కలకలం రేపింది. పార్టీలో తమకు ప్రాధాన్యం కల్పించడం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. పామర్తి రాజీనామా నేపథ్యంలో శుక్రవారం పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన్ని కలిశారు. రాజీనామా ఉపసంహరణ విషయమై చర్చించినా వెనక్కి తగ్గలేదని సమాచారం. సాయంత్రం మరుసుమిల్లి వచ్చిన స్థానిక ఎమ్మెల్యేను పామర్తి కలవకపోవడం గమనార్హం.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని