logo
Published : 27 Nov 2021 04:13 IST

దుకాణంలో రూ.20 లక్షల మాయం

భవానీపురం, న్యూస్‌టుడే: గొల్లపూడి టోకు వ్యాపార కేంద్రంలోని తన దుకాణంలో ఉంచిన రూ.20 లక్షలు కనిపించడం లేదని కొత్తమాసు వెంకటేశ్వర్లు భవానీపురం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి బియ్యం, కిరణా సరకుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నెల 25న రాత్రి దుకాణాన్ని మూసి శుక్రవారం ఉదయం తెరిచారు. దుకాణంలో కారం చల్లి ఉంది. అనుమానం వచ్చి నగదు కౌంటర్‌ను పరిశీలించగా అందులో ఉంచిన రూ.20 లక్షలు నగదు కనిపించలేదు. దుకాణం వెనుక ఉన్న ప్లైవుడ్‌ తొలగించి దొంగలు లోపలకు ప్రవేశించినట్లు గుర్తించారు. దీంతో భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని