Published : 27 Nov 2021 04:13 IST
విద్యుదాఘాతంతో పాలిటెక్నిక్ విద్యార్థి మృతి
చల్లపల్లి, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో పాలిటెక్నిక్ విద్యార్థి మృతి చెందిన ఘటన చల్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్థానిక బయటితోటకు చెందిన మిరియాల శ్రీనివాసరావు కుమారుడు రవికుమార్ (19) పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న అతను శుక్రవారం పశువుల చావిడిలో ఉన్న గేదెలకు గడ్డి వేసేందుకు వెళ్తుండగా విద్యుత్తు తీగ షాక్‌కి గురయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈమేరకు ఎస్సై డి.సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Tags :