logo
Published : 27 Nov 2021 04:13 IST

పేద విద్యార్థులకు చేయూత అవసరం

వసతి గృహాన్ని ప్రారంభిస్తున్న కేవీ చౌదరి, రాజేంద్రప్రసాద్‌

పెనమలూరు, న్యూస్‌టుడే : ఆర్థికంగా బాగున్నవారు పేదవిద్యార్థుల చదువుకు సహకరించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, కాంటినెంటల్‌ కాఫీ ఛైర్మన్‌ చల్లా రాజేంద్రప్రసాద్‌ ఆక్షాంక్షించారు. పెనమలూరులో కమ్మవారి సేవా సమితి- గ్రేటర్‌ విజయవాడ ఆధ్వర్యంలో రూ. 4.50 కోట్ల విరాళాలతో నిర్మించిన కిలారు విశాలాక్షి స్మారక విద్యాలయ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. సెంట్రల్‌ విజిలెన్స్‌ మాజీ కమిషనర్‌ కేవీ చౌదరి మాట్లాడుతూ ఎంత సంపద ఉన్నా పేదలకు సాయం చేస్తేనే సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా పలువురు దాతలు వసతి గృహ నిర్వహణకు విరాళాలను ప్రకటించారు. కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, స్థల దాత కిలారు రామ్మోహనరావు, సేవాసమితి ప్రతినిధులు లింగమనేని శివరాంప్రసాద్‌, దొడ్డపనేని బాబూరావు, బొర్రా గాంధీ, కిలారు ఫణిప్రసాద్‌, కిలారు శివకుమార్‌, కేవీ రావు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని