సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన
మాట్లాడుతున్న ఏపీˆఎన్జీఓ పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు విద్యాసాగర్
గాంధీనగర్ (విజయవాడ), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల పక్షపాతం చూపిస్తోందని ఏపీఎన్జీఓ పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించని పక్షంలో ఉద్యమ కార్యాచరణ తప్పదని, దీనికి ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీనగర్ ఎన్జీఓ భవనంలో నిర్వహించిన ఏపీఎన్జీఓ నగర కార్యవర్గ సమావేశానికి విద్యాసాగర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వేతన సవరణ నివేదిక విడుదల చేయలేదని, నివేదికను తక్షణమే ఉద్యోగ సంఘాలకు అందించి పీఆర్సీపై సైతం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆరు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా కరువుభత్యంకు నోచుకోకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగులు తాము దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ నగదుతో పాటు రుణం తీసుకునే పరిస్థితి కూడా లేకపోవడం, కనీసం బిల్లులు మంజూరు కాకపోవడం దారుణమన్నారు. రవాణా ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజబాబు మాట్లాడుతూ శనివారం ఎన్జీఓ భవనంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, అలాగే 28న ఏపీ ఐకాస రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరుగుతుందని, ఇందులో భవష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. సంఘం నగర శాఖ అధ్యక్షుడు జె.స్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా నాయకులు పి.రమేష్, సీహెచ్ శ్రీరామ్, బి.సతీష్‌కుమార్, మధుసూదనరావు, కె.సంపత్‌కుమార్, నజీర్, బి.వి.రమణ, సి.వి.ఆర్.ప్రసాద్, దుర్గారావు, గణేష్, ఖాసీం, శివలీల తదితరులు పాల్గొన్నారు.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.