logo
Published : 27/11/2021 04:13 IST

ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు పాటించాలి

ప్రసంగిస్తున్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసులు, చిత్రంలో విశ్రాంత జడ్జిలు గుర్రప్ప, విజయ్‌కుమార్‌, తదితరులు

గాంధీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే: ఒకవైపు చట్టసభల్లో రిజర్వేషన్లు పాటిస్తూ మరోవైపు ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసులు ప్రసంగించారు. జడ్జిల నియామకాల్లో జిల్లా స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ ఉన్నత న్యాయస్థానాల్లో అమలు కావడం లేదన్నారు. తిరుపతికి చెందిన విశ్రాంత జడ్జి పి.గుర్రప్ప, విశ్రాంత జడ్జి విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ 2011 నుంచి చెపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, దళిత స్త్రీశక్తి కన్వీనర్‌ గడ్డం ఝాన్సీ, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రాద్‌, ఎం.దేవానందం, తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని