logo
Published : 27 Nov 2021 04:13 IST

భగ్గుమన్న పాత కక్షలు

కోడూరు, న్యూస్‌టుడే: మండలంలోని వి.కొత్తపాలెం గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. గ్రామానికి చెందిన రేపల్లె ప్రతాప్‌పై శుక్రవారం అదే గ్రామానికి చెందిన వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అవనిగడ్డ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తనపై దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. రేపల్లె రాము, ఎలవర్తి మల్లికార్జునరావు, మరికొంతమంది కలిసి తనపై దాడికి ఒడిగట్టారని వివరించారు. బాధితుడు ప్రస్తుతం తీవ్ర గాయాలతో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంతున్నారు. 2014లో గ్రామంలో జరిగిన హత్య కేసులో ప్రతాప్‌ ప్రధాన నిందితుడు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అవనిగడ్డ సీఐ రవికుమార్‌ తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని