logo
Published : 28 Nov 2021 03:10 IST

ఎస్సై దూషించారంటూ సర్పంచి భర్త ఆత్మాహత్యాయత్నం


పురుగు మందు తాగేందుకు ప్రయత్నిస్తున్న నాగేశ్వరరావు

బెల్లంకొండ, న్యూస్‌టుడే : ఎస్సై అసభ్య పదజాలంతో దూషించారంటూ మనస్తాపానికి గురైన సర్పంచి భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండలో శనివారం చోటుచేసుకుంది. బెల్లంకొండకు చెందిన ఇద్దరి మధ్య వ్యక్తిగత తగాదా చోటుచేసుకోగా.. బెల్లంకొండ సర్పంచి గడ్డిపర్తి జ్యోతి భర్త నాగేశ్వరరావు (సముద్రం) పరిష్కరించేందుకు పోలీస్‌స్టేషన్‌కు శనివారం వెళ్లారు. ఈ విషయంలో నాగేశ్వరరావును ఎస్సై రాజశేఖర్‌ స్టేషన్‌ బయటకు వెళ్లమని ఆగ్రహించారు. మనస్తాపానికి గురైన నాగేశ్వరరావు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఎస్సై తనను బయటకు వెళ్లమనడమే కాకుండా వ్యక్తిగతంగా దూషించినట్లు ఆందోళన చేశారు. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా సిబ్బంది, ఎస్సై అడ్డుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తెదేపా నాయకులు పీఎస్కే మస్తాన్‌ షరీఫ్‌, వహాబ్‌, రసూల్‌, చిట్టి, ముస్తాఫా తదితరులు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. గతంలోనూ రెండు సార్లు సర్పంచి భర్తపై ఎస్సై అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. తెదేపాకు చెందిన సర్పంచి అయినందునే ఎస్సై వైకాపా నాయకుల పక్షం ఉంటూ తరచూ ఆమె భర్తను దూషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్సై రాజశేఖర్‌ మాట్లాడుతూ..సివిల్‌ కేసు కనుక స్టేషన్‌ బయటకు వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని చెప్పానని, అతనిని మరే విషయంలోనూ అసభ్య పదజాలంతో దూషించలేదని వివరించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని