logo
Published : 28/11/2021 03:10 IST

‘విజ్ఞాన్‌’ అధ్యాపకుడికి ఆస్ట్రేలియన్‌ పేటెంట్‌

న్యూస్‌టుడే, పొన్నూరు: వడ్లమూడి వద్దనున్న విజ్ఞాన్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీలో ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్‌ కొణిదల సతీష్‌కుమార్‌కు ఆస్ట్రేలియన్‌ పేటెంట్‌ మంజూరైందని ఇన్‌ఛార్జి ఉప కులపతి డాక్టర్‌ కేవీ కృష్ణకిషోర్‌ శనివారం తెలిపారు. ఈమేరకు ఆయన సతీష్‌కుమార్‌కు పేటెంటు మంజూరు పత్రాలు అందజేశారు. ‘కంప్యూటర్‌ ఎయిడెడ్‌ మాలిక్యులర్‌ డాకింగ్‌, ఫిజికో కెమికల్‌ అండ్‌ ఏడీఎంఈటీ ప్రాపర్టీస్‌ ఆఫ్‌  నోవల్‌ బ్రోమొపిరిమిడిన్‌ అనాల్గ్స్‌ యాజ్‌ పొటెన్షియల్‌ ఆంటీ క్యాన్సర్‌ ఏజెంట్స్‌’ అనే అంశంపై పరిశోధన చేసినందుకు ‘ఇంటెలెక్చ్యువల్‌ ప్రాపర్టీస్‌ ఆస్ట్రేలియన్‌ అధారిటీ’ ఈ పేటెంట్‌ను మంజూరు చేసిందన్నారు.

ప్లేట్‌లెట్‌ థెరపీ పరికరానికి..
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: గుంటూరుకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ అమర్‌నాథ్‌ రూపొందించిన ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీ పరికరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్‌ హక్కు దక్కింది. కొత్తపేటలోని అమర్‌ ఆర్థోపెడిక్‌ ఆసుపత్రిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక వైద్యుడు తయారు చేసిన పరికరానికి కేంద్ర ప్రభుత్వం పేటెంట్‌ హక్కు ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి అని తెలిపారు. ఈ పరికరం వినియోగింతో అతి తక్కువ ఖర్చుతో ప్లేట్‌లెట్‌ థెరపీ ఇవ్వవచ్చన్నారు. ప్లేట్‌లెట్స్‌ను తీవ్ర గాయం తగిలిన ప్రాంతంలో సిరంజి సాయంతో ఎక్కించడం వల్ల రోగి త్వరితగతిన కోలుకుంటారని చెప్పారు. ప్లేట్‌లెట్‌ థెరపీ ఎముకలు, కీళ్ల సమస్యలకే కాకుండా, డెర్మటాలజీ, కాస్మటాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, డెంటల్‌ విభాగాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారని వివరించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని