logo
Published : 28/11/2021 03:10 IST

8 మంది వీఏఏల సస్పెన్షన్‌

ఉద్యోగం నుంచి ఒకరి తొలగింపు

కలెక్టరేట్‌(గుంటూరు), ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని రైతు భరోసా కేంద్రాల్లో అనధికారికంగా వేపనూనె అమ్మకాలు చేసిన తొమ్మిది మంది గ్రామ వ్యవసాయ సహాయకులపై వేటు పడింది. ప్రత్తిపాడు మండలంలోని రైతు భరోసా కేంద్రాల ఇన్‌ఛార్జిలైన వీఏఏలు, గ్రామ ఉద్యాన సహాయకుల ద్వారా వేపనూనె అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో కమిటీని విచారణకు పంపారు. కమిటీ విచారణలో వేపనూనె అమ్మకాలు వాస్తవమేనని తేలడంతో ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన సిబ్బందిపై జిల్లా పాలనాధికారి వివేక్‌యాదవ్‌ చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు ఎం.విజయభారతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్తిపాడు మండలం నడింపాలెం-2 గ్రామ వ్యవసాయ సహాయకులు షేక్‌ షాహిద్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు. అన్నంపల్లి త్రినాథ్‌ (నడింపాలెం-1), ఆళ్ల శ్రీనివాస్‌ (ప్రత్తిపాడు-1), గుర్రం చంద్రశేఖర్‌ (ప్రత్తిపాడు-2), చాదల సూర్యప్రకాశ్‌ (ప్రత్తిపాడు-3), కె.నాగరాజునాయక్‌ (యనమదల), సీహెచ్‌ అంజలి (పాతమల్లాయిపాలెం), ఆర్‌.ఎం.కె.అనుదీప్‌రెడ్డి (గొట్టిపాడు), చిన్నరాజారతన్‌సాగర్‌ (వంగీపురం)లను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పాలనాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణాలోపం, బాద్యతారహిత విధుల నిర్వహణ కారణంగా ప్రత్తిపాడు మండల వ్యవసాయాధికారి సీహెచ్‌ విజయరాజును సస్పెండ్‌ చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు జిల్లా పాలనాధికారి సిఫార్సు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు ఎం.విజయభారతి తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని