logo
Published : 28/11/2021 03:10 IST

నిధుల మళ్లింపుపై పార్టీలకతీతంగా పోరాటం

జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడు పాపారావు

అమరావతిరోడ్డు(గుంటూరుసిటీ), న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల నిధులను అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు అన్నారు. నిధుల మళ్లింపుపై సర్పంచులందరూ పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడి నిధులను తిరిగి రాబట్టేందుకు కృషి చేయాలని కోరారు. గుంటూరు నగరం అమరావతి రోడ్డులోని ఒక ప్రైవేటు కల్యాణమండపంలో శనివారం జిల్లా సర్పంచుల ఆత్మీయ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా చిలకలపూడి పాపారావును ఎన్నుకున్నారు. జిల్లాలోని 57 మండలాల నుంచి రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ ‘పంచాయతీల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గతంలో 14వ ఆర్థిక సంఘం నిధులు తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధులను రాత్రికి రాత్రి పంచాయతీ అధికారులు, సర్పంచులకు తెలియకుండా నిధులను దారి మళ్లించడాన్ని పార్టీలకు అతీతంగా సర్పంచులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గత పది నెలలుగా కొవిడ్‌ నివారణ, గ్రామాభివృద్ధి పనులకు తమవంతు కృషి చేసినప్పటికీ సీఎంఎఫ్‌ఎస్‌ ద్వారా నిధులు నెలల తరబడి జమ కావడం లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రదర్శనగా కలెక్టరేట్‌ చేరుకుని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ను కలిసి 14, 15 ఆర్థిక సంఘం నిధులను బేషరతుగా పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. తాము విజ్ఞప్తి చేసిన పలు అంశాలను పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌, ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారని పాపారావు తెలిపారు. ఏపీ పంచాయతీ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు, అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు కాటూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని