logo
Published : 28/11/2021 03:38 IST

భారీగా బియ్యంపట్టివేత

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: నగర శివారు ప్రాంతమైన కొత్తూరు తాడేపల్లిలోని ఓ రైస్‌ మిల్లులో భారీగా నిల్వ ఉంచిన పీడీఎస్‌ (పేదలకు అందించే బియ్యం) బియ్యం బస్తాలను పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు తాడేపలి ్లగ్రామం శివారులోని తండా కాలనీలో కుమార శ్రీ రాఘవేంద్ర రైస్‌ డాల్‌ అండ్‌ ఫ్లోర్‌ మిల్లు ఉంది. అక్కడ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు ఓ గుర్తుతెలియని వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో టాస్క్‌ఫోర్‌, కొత్తపేట పోలీసులు సంయుక్తంగా శుక్రవారం రాత్రి దాడి చేశారు. మిల్లులో 50 కిలోల బియ్యం బస్తాలు 765, 25 కిలోల బస్తాలు 30 ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకుని మిల్లుకు తాళాలు వేశారు. అవి పీడీఎస్‌ బియ్యమా? కాదా? అనే విషయాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు తేల్చాల్సి ఉండడంతో పోలీసులు.. ఆ శాఖ అధికారులకు ఆలస్యంగా సమాచారం ఆలస్యంగా ఇవ్వడంతో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. తమ విచారణలో ఆ మిల్లు గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన తమ్మిశెట్టి శ్రీనివాసరావుకు చెందినదనిగా గుర్తించామని ఎస్‌ఐ శేఖర్‌బాబు తెలిపారు. ఈ విషయమై పౌరసరఫరాల శాఖ విజయవాడ-1 సర్కిల్‌ ఏఎస్‌వో విలియమ్స్‌ మాట్లాడుతూ ప్రాథమికక పరిశీలన పూర్కికాగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసులకు సమాచారం అందించిన గుర్తుతెలియని వ్యక్తికి, బియ్యం నిల్వ ఉంచిన వ్యక్తికి మధ్య బేరసారాలు కుదరకపోవడం వల్లనే ఈ వ్యవహారం బయటకు పొక్కింది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని