logo
Published : 28 Nov 2021 03:38 IST

డిగ్రీ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల

కృష్ణావిశ్వవిద్యాలయం(మచిలీపట్నం),న్యూస్‌టుడే: కృష్ణా విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరం ఒకటో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను శనివారం ఉపకులపతి కె.బి.చంద్రశేఖర్‌ విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 13,263 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకోగా వారిలో 12,107మంది హాజరయ్యారు. వీరిలో 4,159 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా.డి రామశేఖరరెడ్డి తెలిపారు. బీఏ, బీబీఏ, బీసీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సులతో కలిపి మొత్తం 34.35 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. పునఃమూల్యాంకనం కోసం డిసెంబరు 14వ తేదీలోపు నిర్దేశించిన రుసుం చెల్లించాలన్నారు. రిజిస్ట్రార్‌ రామిరెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, పరీక్షల సమన్వయకర్తలు ఎం.శ్రావణి, ఇ.భవానీ, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని