logo
Published : 29/11/2021 05:12 IST

నేడు రెండు పోలీస్‌స్టేషన్ల ప్రారంభం

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సోమవారం రెండు కొత్త పోలీస్‌స్టేషన్లను ప్రారంభించనున్నారు. మరో స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల మొదటి వారంలో జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ లేకపోవటంతో కొత్త పోలీస్‌స్టేషన్ల ప్రారంభోత్సవానికి మార్గం సుగమం అయింది. హోంశాఖా మంత్రి మేకతోటి సుచరిత ఉదయం 11 గంటలకు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 11.30 గంటలకు కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు భవానీపురంలో నిర్మించిన కొత్త స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులుతో పాటు పోలీసు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని