logo
Published : 29/11/2021 05:12 IST

‘వాణిజ్య పన్నుల శాఖలో సిబ్బంది కొరత’

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్న ఆఫీస్‌ సబార్డినేట్స్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పన్నుల శాఖ ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల గోపాలకృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం గవర్నర్‌పేటలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేసన కొండలరావు అధ్యక్షతన జిల్లా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా, కరోనాతో మరణించిన ఉద్యోగులకు నివాళి అర్పించారు. గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో సబార్డినేట్స్‌ కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగులను తమ శాఖకు బదిలీ చేయాలని కోరారు. ఏటా ఇతర ఉద్యోగులకు అందిస్తున్న అవార్డులను తమకూ అందించాలని విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. శాఖలో 280 మంది ఉద్యోగులకు 80 మంది మాత్రమే పనిచేస్తున్నారని, సిబ్బంది కొరత మరింత తీవ్రమైందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.10వేలు, కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రూ.15వేల చెక్కులు అందించారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు రజానీ మీర్జా, ఏడుకొండలరావు, చంద్రశేఖరరావు, శ్రీనివాసరావు, ఇమ్మాన్యుయేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని