logo
Updated : 02/12/2021 22:28 IST

చక్రవ్యూహం

మహానాడు, రామవరప్పాడు కూడళ్లు దాటేదెలా?

ఈనాడు, అమరావతి

స్క్యూ బ్రిడ్జి దాటిన తర్వాత బెంజి రెండో భాగం ప్రారంభంలో కింద వెళ్లాల్సిన వాహనాలు వంతెనపైకి

వచ్చి ఆగిన దృశ్యం. దీని వల్ల వంతెనపైకి వెళ్లాల్సిన వాహనాలు ఆగిపోతున్నాయి

విజయవాడ మధ్య నుంచి వెళ్లే చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై.. రెండో వంతెన కూడా పూర్తయి వినియోగంలోకి వచ్చింది. పద్మవ్యూహాన్ని తలపించే బెంజ్‌ సర్కిల్‌పై ఒత్తిడి తగ్గింది. ట్రాఫిక్‌ సమస్యలు చాలా వరకు తగ్గాయి. దీంతో పాటు నిర్మల, రమేష్‌ కూడళ్లలోనూ ఇబ్బందులు తప్పాయి. పైవంతెనల వల్ల కేవలం మూడు సర్కిళ్లలోనే సమస్య పరిష్కారం అయింది. నగర పరిధిలోని మిగిలిన రెండింటిపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఇక్కడ యధావిధిగా ట్రాఫిక్‌ జామ్‌లు తప్పడం లేదు. రద్దీ సమయాలలో ప్రయాణించాలంటే నరకాన్ని తలపిస్తోంది.

.. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌- 16పై ట్రాఫిక్‌ సమస్యలను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ‘ఈనాడు’ పరిశీలించింది.

ప్రత్యామ్నాయాలివి...

* ఆయుష్‌ ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్‌ కూడలి వరకు, మహానాడు నుంచి బల్లెంవారి వీధి వరకు రోడ్డును పూర్తి చేసి అనుసంధానించాలి. ఇవి పూర్తయితే బెంజి సర్కిల్‌ నుంచి రామవరప్పాడు వరకు ఉపయోగపడుతుంది.

* మహానాడు కూడలి నుంచి వంద అడుగుల రోడ్డు వరకు విస్తరిస్తే ఈ సర్కిల్‌పై ఒత్తిడి తగ్గుతుంది.

* నోవాటెల్‌ హోటల్‌ వద్ద ఆగిన రెండు వంతెనలను నిడమానూరు వరకు పొడిగించాలి.

ఎన్నో కారణాలు...

నగరంలో అనూహ్య రీతిలో వాహనాల సంఖ్య పెరిగింది. నగరం మధ్య నుంచి ఎన్‌హెచ్‌ 16 (చెన్నై - కోల్‌కతా) వెళ్తుంది. విజయవాడలోకి వివిధ మార్గాల ద్వారా రోజుకు 37 వేల వాహనాలు ప్రవేశిస్తాయి. ఇందులో కీలకమైన బెంజిసర్కిల్‌ మీదుగా వెళ్లేవి అత్యధికం. *  ఏలూరు వైపు వెళ్లే వాహనాలు.. పైవంతెన ఎక్కాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ప్రాంతంలో వంతెన, కింద రోడ్డు చీలుతుంది. బెంజిసర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ ఆగితే.. కింద నుంచి వెళ్లే వాహనాలు వంతెన ప్రారంభం వద్దకు వచ్చి ఆగుతున్నాయి. దీని వల్ల బెంజిసర్కిల్‌ రెండో వంతెనపైకి వాహనాలు వెళ్లడానికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది. అక్కడ మరింత విస్తరిస్తే సమస్య తప్పేది. * రామవరప్పాడు నుంచి సర్వీసు రోడ్డు లేదు. దీని వల్ల ఎనికేపాడు, ప్రసాదంపాడు నుంచి ఈ కూడలి వచ్చే వాహనాల కారణంగా రింగ్‌ వద్ద ఒత్తిడి పడుతోంది.


రెండు కూడళ్లు.. 20 నిమిషాలు

మహానాడు కూడలి వద్ద ట్రాఫిక్‌ అవస్థలు..

వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తోంది చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి. రామవరప్పాడు నుంచి స్క్యూ బ్రిడ్జి వరకు చుక్కలు కనిపిస్తోంది. ఏలూరు వైపు నుంచి వస్తున్న వాహనాలకు రామవరప్పాడు వరకు పెద్దగా సమస్యలు ఉండడం లేదు. ఉదయం 9 నుంచి 11 గంటలు, సా. 5 నుంచి రా. 8.30 గంటల వరకు రద్దీ సమయాలు. రామవరప్పాడు సర్కిల్‌ నుంచి మహానాడు కూడలికి చేరుకోవడానికి 20 నిమిషాలు పైగా పడుతోంది.

* రామవరప్పాడు నుంచి మహానాడు కూడలి వరకు దూరం 1.6 కి.మీ. అక్కడి నుంచి పైవంతెన ఎక్కేందుకు సుమారు కి.మీ దూరం ఉంటుంది. మొత్తం 2.6 కి.మీ దూరానికి నరకయాతన తప్పడం లేదు. రెండు సర్కిళ్లలో ఒక్కో దాని వద్ద కనీసం 10 నిమిషాల వరకు వేచి చూడాల్సి వస్తోంది. స్క్యూ బ్రిడ్జి వద్ద రామలింగేశ్వరనగరకట్ట, పటమట వెళ్లే వాహనాల కోసం ట్రాఫిక్‌ను ఆపుతున్నారు. వెరసి 4.5 కి.మీకు అర్ధగంట సమయం పడుతోంది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని