logo
Published : 29/11/2021 05:12 IST

తీపి పంచేనా..!

నేడు కేసీపీలో క్రషింగ్‌ ప్రారంభం

ఉయ్యూరు, న్యూస్‌టుడే

జిల్లాలో ఎన్నో ఆటుపోట్లు, ప్రతికూల పరిస్థితులను చవిచూస్తూ వస్తున్న చెరకు రైతులు ఈసారి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ధర విషయంలో కొంత అసంతృప్తి ఉన్నా అలవాటుగా మారిన సాగును వదులుకోలేక ఎంతో కొంత విస్తీర్ణంలో పండిస్తూ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు యాంత్రీకరణలో వెనుకబాటు ప్రభావం వారిపై పడింది. ఈ నేపథ్యంలో ఉయ్యూరు కేసీపీ కర్మాగారం 2021-22 సీజన్‌ క్రషింగ్‌ను ఈనెల 29న ప్రారంభించనుంది. 2018-19లో 9 లక్షల టన్నులు గానుగాడగా.. 2020-21లో నాలుగు లక్షలకు పడిపోయింది. గత సీజన్‌లో 11,381 ఎకరాల్లో సాగు చేయగా.. 3.10 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి చేశారు. సగటు దిగుబడి 36.13 టన్నులు, పంచదార రికవరీ 9.27శాతంగా ఉంది. రైతులకు రూ.129 కోట్లు చెల్లించారు. ఈ సీజన్‌లో గతేడాది కంటే కొంత మెరుగ్గా ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది.

కేసీపీ కర్మాగారం

వివరాలు 2021-22లో

సాగు విస్తీర్ణం: 11,701 ఎకరాలు

గానుగ లక్ష్యం 4.20 లక్షల టన్నులు

గ్రామాలు: 295

రైతులు: 6200

సరాసరి దిగుబడి అంచనా 36 టన్నులు

చెల్లించే ధర 3,300 టన్నుకు (రాయితీతో కలిపి)

పంచదార రికవరీ 9.5%

సాగు చేస్తున్న మండలాలు: 31

 

నూరు శాతం చెల్లింపులు

గత సీజన్‌ సొమ్ములు నూరు శాతం చెల్లించాం. కర్మాగారం భవిష్యత్తు బాగుండాలంటే చెరకు విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉంది. ఉయ్యూరు కేసీపీ కర్మాగారానికి గానుగాడే సామర్థ్యం ఎక్కువగానే ఉంది. దానికి తగినట్లుగా టన్నేజీ వస్తే బాగుంటుంది. అందుకు రైతుల్లో అవగాహన కల్పించి విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నాం.

- వి.వి.పున్నారావు, జనరల్‌ మేనేజర్‌, వ్యవసాయ విభాగం


30 ఎకరాల్లో వేశా

- రాజేశ్వరరావు, పునాదిపాడు

ప్రస్తుతం 30 ఎకరాలు కౌలుకు తీసుకొని చెరకు సాగు చేస్తున్నా. కంద, పసుపు వేసి నష్టాలు ఎదుర్కొన్నా. మరోపక్క వర్షాలతో వరి సాగుకు ఇబ్బందైంది. బస్తాకు రూ.రెండు నుంచి మూడు వందల వరకు నష్టపోతున్నాం. దీనికితోడు దాళ్వా వేయవద్దంటున్నారు. ఈ పరిస్థితుల్లో లాభం రాకున్నా చెరకు సాగు కొంత ఆదుకుంటుందని ఆశిస్తున్నా.


ప్రభుత్వ విధానంలో మార్పు అవసరం

- ఎస్వీ కృష్ణారావు, అధ్యక్షుడు, చెరకు రైతు సంక్షేమ సంఘం

చెరకు రైతు అభ్యున్నతి విషయంలో ప్రభుత్వ విధానంలో మార్పు అవసరం. సాగు ఖర్చులు గణనీయంగా పెరిగాయి. నరికేందుకే ఎక్కువ ఖర్చు అవుతుంది. యాంత్రీకరణ ప్రధానం. ప్రభుత్వం రవాణా రాయితీ టన్నుకు కనీసం రూ.300 అయినా ఇవ్వాలి. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని