logo
Published : 29/11/2021 05:12 IST

‘అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాం’


మాట్లాడుతున్న సోము వీర్రాజు

తాడేపల్లి: అమరావతిలోనే రాజధానిని కొనసాగించడానికి భాజపా కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. తాడేపల్లి ప్రాతూరు కరకట్ట మార్గంలోని కొండపావులూరు గార్డెన్‌లో విజయవాడ పార్లమెంటు పరిధిలోని పార్టీ కార్యకర్తలతో కార్తిక వనసమారాధనను ఆదివారం నిర్వహించారు. సభలో సోమువీర్రాజు మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే సంకల్పంతో స్థానికంగా రూ.1800 కోట్లతో ఎయిమ్స్‌ వైద్యశాల, వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృష్ణానదిపై మరో వంతెన ఏర్పాటు, జాతీయ రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులను, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వారితోపాటు గెలుపొందిన అభ్యర్థులను సత్కరించారు. విజయవాడ పార్లమెంటు పార్టీ అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్‌ పార్టీ కార్యాలయానికి రూ.1,01,116లను విరాళంగా అందజేశారు. రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు బాజీ, నాయకులు ఉమామహేశ్వరరాజు, శ్రీరామ్‌, శ్రీధర్‌, ఆర్ముగం, శ్రీకాంత్‌, మౌలాలీ, నిరీష్‌, రఘనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని