logo
Published : 29/11/2021 05:31 IST

4 నెలల్లో 241 మరణాలు

ఈనాడు, అమరావతి

కృష్ణా జిల్లాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గినా కేసులు మాత్రం ఇప్పటికీ రోజుకు 30 నుంచి 40 మధ్యలో నమోదవుతూనే ఉన్నాయి. మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉంటున్నాయి. గత నాలుగు నెలల్లో 241 మంది కొవిడ్‌ బారినపడి చనిపోయారు. తాజాగా శనివారం ఉదయం 9గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో 34 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు. ఇప్పటివరకు జిల్లాలో 1,20,228 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 1455 మంది చనిపోయారు. 1,18,392 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం జిల్లాలో 381 మంది వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్న వారున్నారు. కొంతమంది ఆసుపత్రుల్లో ఉండగా.. ఎక్కువ మంది ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా వాతావరణ పరిస్థితులు మారడంతో వైరల్‌ జ్వరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యంగా ఉంటే కొవిడ్‌ ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. బయటకు వెళితే మాస్కులను ధరించాలని చెబుతున్నా.. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. భౌతికదూరం కూడా పాటించకుండా గుంపులుగా ఉంటూ కనిపిస్తున్నారు. ఇది వైరస్‌లకు అనుకూలమైన సమయం కావడంతో.. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని