logo
Published : 29/11/2021 05:31 IST

అందరికీ సమానంగా విద్య


మాట్లాడుతున్న తెలకపల్లి రవి

ఈనాడు, అమరావతి: సమాజంలో అందరికీ సమానంగా విద్య అందించేందుకు పాలకులు కృషి చేయాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పేర్కొన్నారు. యూటీఎఫ్‌, సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కొమ్మారెడ్డి కేశవరెడ్డి ప్రథమ స్మారక సాహితీ అవార్డుల ప్రదానోత్సవం విజయవాడలో ఆదివారం జరిగింది. ప్రథమ స్మారక అవార్డును ప్రముఖ అభ్యుదయ రచయిత, అనువాదకులు రావెల సాంబశివరావుకు అందించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు అధ్యక్షతవహించారు. ముఖ్య అతిథిగా రవి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తిలో నుంచి వచ్చి సాహితీ రంగంలో కృషి చేసిన కేశవరెడ్డి ఆదర్శనీయులన్నారు. రచనల ద్వారా సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించే తత్వాన్ని పెంచాలన్నారు. వాస్తవిక, మానవత్వ ప్రతీకలుగా రచనలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అమ్మ అనే మాటే అనిర్వచనీయమైనదని, దీనిని కించపరిచే సంస్కృతి సమాజంలో ఉంటే భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశం ఇవ్వగలమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కాలంలోనైనా పాలకవర్గ ప్రయోజనాలే విద్యా విధానాలుగా ఉంటున్నాయన్నారు. విద్యా రంగంలో ప్రస్తుతం వస్తున్న మార్పులు కొద్దిమందికి మాత్రమే చదువుకునే అవకాశం కల్పిస్తున్నాయని తెలకపల్లి రవి పేర్కొన్నారు. ఇది మధ్య యుగాల నాటి పరిస్థితులకు దారితీసే అవకాశం కల్పిస్తోందన్నారు. అవార్డు గ్రహీత సాంబశివరావు మాట్లాడుతూ.. సమాజాన్ని చిన్నప్పటి నుంచే నిశితంగా పరిశీలించడం తనకు అలవాటన్నారు. అదే తనను రచయితగా మార్చిందని తెలిపారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఎ.కుసుమకుమారి, కార్యదర్శులు ఎ.కృష్ణ సుందరరావు, ఎస్‌.పి.మనోహరకుమార్‌, సాహితీ ప్రస్థానం వర్కింగ్‌ ఎడిటర్‌ సత్యాజి, చైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డి.ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని