logo
Published : 29/11/2021 05:31 IST

సింగలూరులో ఎల్బీ శ్రీరాం


వివేకానంద విగ్రహం వద్ద గ్రామస్థులతో శ్రీరాం

సింగలూరు (గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: సినీనటుడు, రచయిత ఎల్బీ శ్రీరాం సింగలూరులో ఆదివారం పర్యటించారు. పొట్టి చిత్రాలు తీస్తున్న ఆయన ‘గ్రామీణ ప్రాంతంలో స్వయం సమృద్ధి’ అనే అంశంపై గ్రామాన్ని సందర్శించారు. చిన్న పల్లెటూరు అయిన సింగలూరులో గ్రామస్థులు సమష్టిగా నిర్మించుకున్న సామాజిక భవనం, రామాలయం, ఏటీఎం వాటర్‌ప్లాంట్‌, గ్రంథాలయం, దంతవైద్యశాల, విస్తర్ల తయారీ కేంద్రం, వివేకానంద విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకమత్యం, సమష్టి కృషితో సుసంపన్నమైన విలువలు కలిగిన గ్రామాలను నిర్మించుకోవచ్చని సింగలూరును చూస్తే తెలిసిందన్నారు. మహిళల ఆర్థిక ఉన్నతితోనే కుటుంబాలు, సమాజం వృద్ధి సాధిస్తుందన్నారు. భాగ్యవిధాత ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ బండారు శ్యాంకుమార్‌, సరస్వతి, కౌతవరం పీహెచ్‌సీ వైద్యురాలు సీహెచ్‌.సుగుణావతి, సాహితీవేత్తలు వెన్నా వల్లభరావు, గుమ్మా సాంబశివరావు, సుంకర నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని