logo
Published : 29/11/2021 05:31 IST

వైకాపా నాయకుడి కారులో తెలంగాణ మద్యం స్వాధీనం


స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు, నిందితుడు శ్రీనివాసరావుతో ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది

మైలవరం, న్యూస్‌టుడే: మండలంలోని అనంతవరానికి చెందిన వైకాపా నాయకుడు కోడే శ్రీనివాసరావు కారులో తెలంగాణ మద్యం తరలిస్తుండగా ఎస్‌ఈబీ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై వెంకట్‌కుమార్‌ ఆధ్వర్యంలో బృందం స్వాధీనం చేసుకుంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం నుంచి మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి అనంతవరంలో నిఘా పెట్టారు. చెక్‌పోస్ట్‌ను దాటి గ్రామంలోని సందులోకి వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేశారు. అందులో 480 తెలంగాణ మద్యం సీసాలను గుర్తించారు. కారు, మద్యం సీసాలతో పాటు నిందితుడు శ్రీనివాసరావును మైలవరం ఎస్‌ఈబీ స్టేషన్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేశామని సీఐ గిరిజ సత్యకుమారి తెలిపారు. కారు వెనుక అద్దంపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ చిత్రంతో కూడిన స్టిక్కర్‌ అతికించి ఉండటం గమనార్హం.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని