logo
Published : 29/11/2021 05:31 IST

కమిషనరేట్‌ పరిధిలో నిర్బంధ తనిఖీలు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : విజయవాడ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ (నిర్భంద తనిఖీలు) నిర్వహించారు. ఈస్ట్‌ డివిజన్‌లోని గన్నవరం పీఎస్‌ పరిధిలోని చెంచుల కాలనీ, నార్త్‌ డివిజన్‌ సత్యనారాయణపురం పీఎస్‌ పరిధిలోని రైల్వేస్టేషన్‌, సౌత్‌ డివిజన్‌ సూర్యారావుపేట పీఎస్‌ పరిధిలోని అన్నదాన సమాజంరోడ్డులో, సెంట్రల్‌ డివిజన్‌ పెనమలూరు పీఎస్‌ పరిధిలోని యనమలకుదురు ఇందిరానగర్‌లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 549 ఇళ్లను తనిఖీ చేసి 1,491 మందిని విచారించారు. వీరిలో 223 మంది ఐరిష్‌ పరిశీలించగా, ముగ్గురు రౌడీషీటర్లు, 8 మంది లా అండ్‌ ఆర్డర్‌ సస్పెక్ట్‌ షీటర్లు, ఆరుగురు క్రైం సస్పెక్ట్‌లు ఉన్నట్లు గుర్తించారు. 581 ద్విచక్రవా హనాలను పరిశీలించగా, ఎలాంటి రికార్డులు లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.30 వాహనాలకు చలానాలు విధించారు. పశ్చిమ, తూర్పు డీసీపీలు హర్షవర్ధనరాజు, బాబూరావుల నేతృత్వంలో ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని