logo
Updated : 29/11/2021 05:48 IST

ఉల్లాసంగా..ఉత్సాహంగా

ఈత శిక్షణలో చిన్నారులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:  అమరావతి వాకర్స్‌ రన్నర్స్‌ (అవార) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వేకువజామున నిర్వహించిన పరుగు, నడక, ఈత శిక్షణలో పలువురు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారని అవార వ్యవస్థాపకుడు, ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ అజయ్‌ కాట్రగడ్డ తెలిపారు. ఊబకాయంతో కుంగిపోతున్న చిన్నారుల్లో సహజసిద్ధమైన ఉత్సాహం, ఉత్తేజం నింపడమే ప్రకృతిలో ఆహ్లాద ఆదివారాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. చిన్నారులు, పలువురు వైద్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమాలను నయన వైద్య విద్యావేత్త, కవి డాక్టర్‌ రవికిరణ్‌ పొట్లూరి జెండా ఊపి ప్రారంభించారు. చిన్నారులకు సుశిక్షితులైన శిక్షకుల పర్యవేక్షణలో సురక్షితమైన ప్రాంతంలో, ఏకాగ్రత గల అభ్యాసంతో శిబిరం జరుగుతుందన్నారు. అనంతరం సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార ఉత్పత్తుల చిరు ప్రదర్శనను సుభాష్‌రెడ్డి నిర్వహించారు. అరవింద పాఠశాల విద్యార్థులు తయారు చేసుకొచ్చిన రాగిజావ, పొల్గొన్న చిన్నారులకు ఎంత మేలు చేస్తుందో వివరించారు. ప్రముఖ ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వైవీ రావు విజేతలకు బహుమతులు అందించారు. వస్త్ర సంచీల రూపశిల్పి కల్లూరి ఆత్మారాం, ఉపాధ్యాయులు శకుంతలాదేవి, షారోన్‌, ధనుంజయ్‌, పలువురు చిన్నారుల తాతలు, తల్లిదండ్రులు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షణ అవసరమైన వారు 94941 26812 నంబరుకు ఫోన్‌ చేసి సంప్రదించాలని కోరారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని