logo
Updated : 29/11/2021 05:48 IST

జనవరి 8 నుంచి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌


గోడప్రతులను ఆవిష్కరిస్తున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నంబూరులోని ఎస్పీవీ జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జనవరి 8 నుంచి రెండు రోజుల పాటు 40వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తామని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సైకం రామ్‌ప్రసాద్‌ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు నివాసం వద్ద ఆదివారం ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారని చెప్పారు. గత 40 ఏళ్లగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి చుక్కా కొండయ్య, సుమేధ సీఈవో, చీఫ్‌ ప్యాట్రన్‌ సుందర్‌ విశ్వనాథపల్లి, కృష్ణా జిల్లా సంఘం కార్యదర్శి జీవీ ప్రసాద్‌, అధ్యక్షుడు కంది గంగాధరరావు, ఉపాధ్యక్షులు టి.భాస్కర్‌, పద్మనాభం, సంయుక్త కార్యదర్శి వి.కొండలరావు, పీజే ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని