logo
Published : 29/11/2021 05:46 IST

నిర్ధరణా..

అటకెక్కిన బ్లడ్‌ గ్యాస్‌ ఎన్‌లైజర్లు, ఈసీజీ మిషన్లు

పట్టించుకోని జీజీహెచ్‌ యంత్రాంగం

ఈనాడు-అమరావతి


క్యాడ్రిజ్‌ ఆధారిత ఏబీజీ మిషన్‌

కరోనా మహమ్మారి తీవ్రత బాగా ఉన్నప్పుడు గతంలో పీఎం కేర్‌ కింద గుంటూరు జీజీహెచ్‌, గుంటూరులోని జ్వరాల ఆసుపత్రి, తెనాలి జిల్లా ఆసుపత్రికి బ్లడ్‌ గ్యాస్‌ ఎన్‌లైజర్‌ (ఏబీజీ) మిషన్లను కేంద్రం పంపింది. వెంటిలేటర్‌ సాయంతో చికిత్సలు పొందేవారికి తొలుత వాళ్ల రక్తంలో ఆక్సిజన్‌, క్లోరైడ్స్‌, ఆల్ట్రానైట్స్‌, కార్బన్‌డయాక్సైడ్‌ శాతాలు ఏమేరకు ఉన్నాయో నిర్ధారిస్తారు. అవి తెలుసుకోవటానికి ఏబీజీ పరీక్షలు తప్పనిసరి. ఈ పరీక్ష నిర్వహణకు ప్రైవేటు ల్యాబ్‌ల్లో రూ.1000 నుంచి 1500 దాకా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే ఇవి చేస్తారు. కొంతకాలం నుంచి వాటి నిర్వహణకు అవసరమైన క్యాడ్రిజ్‌, రియోజెంట్స్‌ లిక్విడ్‌ లేక ఆ పరీక్షలు జిల్లాలో నిలిచిపోయాయి. కొవిడ్‌తో సంబంధం లేకుండానే చాలా మంది అనేక వ్యాధుల బారినపడి ఊపిరాడక వెంటిలేటర్‌ సాయంతో వైద్యం పొందటానికి సగటున జీజీహెచ్‌కు రోజుకు 50 మంది వరకు వస్తారు. ఇక్కడ వెంటిలేటర్లకు ఎప్పుడు చూసినా డిమాండ్‌ ఉంటుంది. ఒక్కోసారి రోగుల రద్దీ బాగా ఉన్నప్పుడు కొంతమందికి వెంటిలేటర్‌ వైద్యం ఇంకా అవసరమైనా సాధారణ వార్డుకు షిప్టు చేసి వైద్యసేవలు అందిస్తారు. ఖరీదైన వెంటిలేటర్లను కేంద్రం సరఫరా చేసినా వాటిని వినియోగించుకోలేని దుస్థితిలో ఆస్పత్రి ఉంది. నిర్వహణకు అవరమైన బడ్జెట్‌ లేక ఆ యంత్రాలను పక్కనపెట్టేశామని గుంటూరు, తెనాలిలోని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఏబీజీ మిషన్లు రెండురకాలుగా పనిచేస్తాయి. కొన్నింటికి క్యాడ్రిజ్‌లు అమర్చాలి. మరికొన్నింటికి లిక్విడ్‌ పోయాలి. 24 గంటల పాటు లిక్విడ్‌ పని చేస్తూనే ఉండాలి. అప్పుడే అది మనుషుల్లో ఏయే స్థాయిలు ఎంత ఉన్నాయో పక్కాగా కొలతలను చూపిస్తుంది. క్యాడ్రిజ్‌ కూడా ఖరీదైనది కావటంతో సమకూర్చటం లేదు. ఆసుపత్రిలో 10 వరకు ఈ యంత్రాలు ఉన్నాయి. క్యాడ్రిజ్‌తో నడిచేవి మూడు కాగా మిగిలినవి రియోజెంట్స్‌తో నడిచేవే. మొత్తంగా జీజీహెచ్‌లో ఏబీజీ యంత్రాలు పనిచేయక పరీక్షలు నిలిచిపోవడంతో రోగుల చేతి చమురు బాగానే వదులుతోంది. చాలా మంది పరీక్షలకు బయటకు వెళ్లి చేయించుకునే ఆర్థిక స్థోమత లేదు. కనీసం వాటిని ఆరోగ్యశ్రీలో అయినా ఉచితంగా చేయించేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. సగటున రోజుకు ఈ పరీక్షలు వంద మందికి పైగా చేయాల్సి ఉంటుందని టెక్నీషియన్లు అంటున్నారు.


24 గంటలు నడిచే ల్యాబ్‌లో మూలనపడి ఉన్న లిక్విడ్‌ ఆధారిత ఏబీజీ మిషన్‌

ఈసీజీ యంత్రాలది అదే పరిస్థితి

ఏడెనిమిది ఈసీజీ మిషన్లు పనిచేయడం లేదు. గతంలో ఇవి వార్డుల్లోనూ ఉండేవి. దీంతో నర్సులే అవసరమైన రోగులకు ఈసీజీలు తీసేవారు. రోజుకు 400-500 మందికి వాటిని తీయాల్సి ఉంటుంది. అయితే ఆసుపత్రిలో మిషన్లు పనిచేయకపోవటంతో చివరకు వాటిని కూడా బయటే తీయించుకోవాలని రోగులు వాపోతున్నారు. ఈ మిషన్లకు రూ. 3-4 వేలు వ్యయం చేస్తే అవి మరమ్మతులకు నోచుకుంటాయి. బడ్జెట్‌ లేమితో అవి నెలలు తరబడి అటకెక్కాయి.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని