logo
Published : 29/11/2021 05:46 IST

ఆటో డ్రైవర్‌ నిజాయతీ

రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాల అప్పగింత


బాధితురాలికి బంగారు ఆభరణాల బాక్సును అందిస్తున్న వాహనచోదకుడు, సీఐ

పెదకూరపాడు, న్యూస్‌టుడే: రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న నగల సంచి పోలీసులకు అప్పగించి ఆటోడ్రైవర్‌ నిజాయతీ చాటుకున్నాడు. పెదకూరపాడు సీఐ తిరుమలరావు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి నుంచి తన స్వగ్రామమైన పెదకూరపాడు మండలం గారపాడులో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠకు గోలి నిరోష తన పిల్లలు, సోదరితో కలిసి ద్విచక్ర వాహనంపై ఆదివారం బయలుదేరారు. మేడికొండూరు మండలం సిరిపురం వచ్చే సరికి వర్షం పెద్దది కావడంతో తన సోదరి, పిల్లలను ఆటో మాట్లాడి తను ద్విచక్ర వాహనంపై గారపాడు చేరుకొన్నారు. ఆటో దిగే క్రమంలో బంగారు వస్తువులు ఉన్న సంచిని మర్చిపోయి వారు దిగిపోయారు. కొంతసేపటికి తేరుకొని బంగారు ఆభరణాలు ఉన్న సంచి మాయమైనట్లు గుర్తించి పెదకూరపాడు పోలీసులను ఆశ్రయించారు. ప్రయాణికులను దించి కొంత దూరం వెళ్లిన తర్వాత ఆటో చోదకుడు ఒద్దాని నరసింహారావు సంచిని గుర్తించి పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో అందించారు. సీఐ తిరుమలరావు నిరోషను స్టేషన్‌కు పిలిపించి చోదకుడు నరసింహారావు చేతుల మీదుగా ఐదు సవర్ల బంగారు ఆబరణాలు ఉన్న సంచిని అందించారు. నిజాయతీ చాటిన ఆటోడ్రైవర్‌ను సీఐ తిరుమలరావు, ఆమె కుటుంబ సభ్యులు అభినందించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని