logo
Published : 30/11/2021 04:52 IST

ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలి

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నివాస్‌

మచిలీపట్నం, న్యూస్‌టుడే: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లాలోని 90 పీహెచ్‌సీలు, 13 సామాజిక ఆస్పత్రులు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథక అమలును సమీక్షిస్తూ జిల్లా అధికారులు తరచూ తనిఖీలు చేసి భోజన నాణ్యత, రుచి పరిశీలించాలన్నారు. స్పందన కార్యక్రమానికి గైర్హాజరైన ఐదుగురు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఉద్యానశాఖ రైతులకు అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేయాలి.. తన భర్త చేసిన అప్పులు తీర్చకుండా అమెరికా వెళ్లిపోయిన కొడుకు నుంచి తనకు న్యాయం కల్పించే విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ గన్నవరానికి చెందిన ఓ మహిళ, దౌర్జన్యకరంగా వ్యవహరిస్తున్న భర్త నుంచి రక్షణ కల్పించడంతో పాటు కట్నంగా ఇచ్చిన డబ్బులు ఇప్పించాలని ఫిర్యాదులు చేస్తున్నా ఎందుకు స్పందించరంటూ మచిలీపట్నానికి చెందిన మరో మహిళ కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు వారిని బయటకు పంపించారు.

* సరైన అనుమతులు లేకుండా బందరు డివిజన్‌లో పుట్టుకొస్తున్న నకిలీవాటర్‌ ప్లాంట్‌లు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని విచారించి తగు చర్యలు తీసుకోవాలని శివరామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

* ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పంచాయతీల్లో ఇళ్ల పన్నులు వసూలు చేసేందుకు డిమాండ్‌ నోటీసు పత్రాలకు సంబంధించిన పుస్తకాలు లేవని అవి సమకూర్చి సకాలంలో పన్నుల వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్‌ కోరారు.

* ప్రభుత్వం తన భార్యపేరుతో మంజూరు చేసిన స్థలంలో గృహం నిర్మిస్తుండగా కుటుంబ కలహాలతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయి రావడం లేదని, స్లాబ్‌ వేసుకోవాల్సి ఉన్నందున సదరు అనుమతులను తన పేరుకు మార్చాలని మొవ్వ మండలానికి చెందిన విజయకాంత్‌ అర్జీ సమర్పించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని