logo
Updated : 30/11/2021 06:53 IST

బహుమతుల పేరుతో టోకరా

వివిధ సాకులతో అందినకాడికి లూటీ

పెద్ద సంఖ్యలో మోసపోతున్న నగరవాసులు

ఈనాడు - అమరావతి: బహుమతి అనగానే.. ఎంతటి వ్యక్తి అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. సరిగ్గా ఇదే బలహీనతను కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. తమ తెలివితేటలను ఉపయోగించి తేలికగా బురిడీ కొట్టిస్తున్నారు. తీసిన డ్రాలో బహుమతి వచ్చిందని చెప్పి నమ్మిస్తారు. వివిధ ఛార్జీలు, పన్నుల పేరుతో భారీగా డబ్బు కట్టించుకుని ముఖం చాటేస్తారు. ఈ విధంగా నగరంలో నిత్యం పలువురు మోసపోతున్నారు.

అందినకాడికి దండుకుంటారు

‘ఈ మధ్య మీరు ఆన్‌లైన్‌లో వస్తువు కొన్నారు కదా.. మేం తీసిన లక్కీడిప్‌లో మీకు కారు బహుమతి వచ్చింది.’ అని ఫోన్‌ చేస్తారు. ‘మీకు వచ్చిన బహుమతి వద్దనుకుంటే దాని విలువను మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తా’మని నమ్మబలుకుతారు. కారును మీ రాష్ట్రానికి తీసుకువెళ్లాలంటే రిజిస్ట్రేషన్‌, పన్నుల సమస్య ఉంటుందని చెబుతారు.

* ఈ సమస్యకు పరిష్కారంగా.. పన్ను చెల్లిస్తే సరిపోతుందని, రవాణా అధికారులు అభ్యంతరం చెప్పరని నమ్మకంగా చెబుతారు. అది నమ్మి చెల్లిస్తే.. అంతటితో ఆగరు. మరో కొత్త కారణం చెప్పి రెండు, మూడు రోజుల తర్వాత ఫోన్‌ చేస్తారు. వాహన బీమా చెల్లించాలని అంటారు. దీనికీ సిద్ధపడి చెల్లిస్తే.. మళ్లీ కొన్నాళ్లు ఆగి మరో కారణంతో ఫోన్‌ చేస్తారు. వాహనంపై జీఎస్టీ వేశారని, ఇది చెల్లించకపోతే రాదని భయపెడతారు.

* ఏమాత్రం నమ్మి డబ్బు వేస్తే, ఇంకో సారి చేసి కేంద్ర ప్రభుత్వం జరిమానా విధించిందని, దానిని చెల్లిస్తే సరిపోతుందని ఫోన్‌ చేస్తారు. ఇలా రోజుకొక కారణం చెప్పి అందినకాడికి దోచుకుంటారు. ఎంత కట్టినా, ఇంకా ఏదో సాకు చెప్పి డబ్బులు జమ చేయించుకుంటూనే ఉంటారు. ప్రతి సారి కొత్త ఖాతా నెంబరు ఇస్తారు. ఒకసారి బ్యాంకు ఖాతా ఇస్తే, మరో సారి ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా చెల్లించమని చెబుతారు. ఇవన్నీ వేర్వేరు బ్యాంకు ఖాతాలు కావడం విశేషం.


మోసమే పెట్టుబడి

* మాచవరం స్టేషను పరిధిలోని ప్రాంతానికి చెందిన యువతికి.. రెవ. థామస్‌ మోజెస్‌ ఫ్రేక్‌, రెవ. మేరీ గ్లోరీ అనే ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ పేర్ల నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దీనికి ఆమె ఆమోదం తెలపింది. తర్వాత వారితో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో వారితో ఛాటింగ్‌ కొనసాగించింది. తాము ఇంగ్లాండులోని ఓ చర్చిలో పాస్టర్లమంటూ వారు ఆమెతో పరిచయం చేసుకున్నారు. కొన్నాళ్లకు.. యాపిల్‌ ల్యాప్‌టాప్‌, రెండు ఐఫోన్లు, మూడు జతల బూట్లు, 20 వేల పౌండ్లు డబ్బును పార్శిల్‌లో విజయవాడకు పంపుతున్నట్లు యువతికి చెప్పారు. నాలుగు రోజులకు.. దిల్లీలోని కస్టమ్స్‌ కార్యాలయం నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. పార్శిల్‌కు రూ.34,800 సుంకం చెల్లించాలని ఖాతా నెంబరు ఇచ్చాడు. ఈ మొత్తం చెల్లించింది. తర్వాత వివిధ కారాణాలు చెబుతూ దఫదఫాలుగా మొత్తం రూ. 4.47 లక్షలు జమ చేసింది.


* నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో పోస్టులో కవరు వచ్చింది. తెరిచి చూడగా.. అందులో స్క్రాచ్‌ కార్డు ఉంది. దానిపై గీకితే కారు గెలుపొందినట్లు కనిపించింది. వెంటనే అందులో ఉన్న నెంబరుకు ఫోన్‌ చేశాడు. కారు డెలివరీ ఇవ్వడానికి పన్నులు చెల్లించాలంటూ పలు సార్లు రూ. 4.38 లక్షలు చెల్లించాడు.


ఊరికే ఎవరూ ఇవ్వరు..

 - హర్షవర్దన్‌ రాజు, తూర్పు మండల డీసీపీ, విజయవాడ

బహుమతి వచ్చిందని అపరిచితుల నుంచి కాల్స్‌ను వస్తే నమ్మొద్ధు గుడ్డిగా నమ్మితే నిలువునా ముంచుతారు. ఇటువంటి వారి విషయలో అప్రమత్తంగా ఉండాలి. బహుమతి తీసుకునేందుకు డబ్బు చెల్లించాలని చెప్పే వాటిని అసలు పట్టించుకోవద్ధు కనీస వివరాలు తెలుసుకోండి. వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాలు ఇచ్చి అందులో డబ్బు వేయమంటారు. దర్యాప్తులో ఎక్కడా చిక్కకుండా ఉండేందుకు ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడతారు. ఏవ ైనా ఆఫర్లు, బహుమతులు ఉంటే.. ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థలు తమ ఖాతాదారులకు వ్యక్తిగతంగా మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేస్తాయి. అంతే కానీ డబ్బు చెల్లించమని కోరవు.


 

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని