logo
Published : 30/11/2021 05:00 IST

నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్‌

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: నకిలీ పత్రాలతో భూమి విక్రయించి మోసం చేసిన ఓ వ్యక్తిపై కొత్తపేట పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. స్థానిక పీతల కనకయ్యవీధిలో మేడి విజేత, శ్రీనివాసరావు దంపతులకు మండల శ్రీనివాసరావు అనే వ్యక్తి కంచికచర్లలో స్థిరాస్తి ఉందని చెప్పి 2014 ఏప్రిల్‌లో 1.03 ఎకరాల భూమిని రూ.48 లక్షలకు విక్రయించారు. భూమిని విజేత తన పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అదే రోజున ఆమె సోదరి విరుపిళ్ల వినీత కూడా శ్రీనివాసరావు వద్ద మరో 1.02 ఎకరాలు కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అప్పటి నుంచి భూమిని కొనుగోలుదారులకు స్వాధీనం చేయలేదు. వీరు ఆరా తీయగా, నకిలీ పత్రాలతో శ్రీనివాసరావు మోసం చేశాడని తేలింది. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై విజయలక్ష్మి తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని