logo
Published : 30/11/2021 05:00 IST

ఉపాధి కల్పన సంస్థకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషి

బాధ్యతలు స్వీకరిస్తున్న శ్యాంప్రసాద్‌రెడ్డి

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని కార్పొరేషన్లలో అతి ముఖ్యమైనది ఉపాధి కల్పన, వ్యవస్థాపక సంస్థ అని, దానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విధంగా పని చేస్తానని సంస్థ ఛైర్మన్‌ శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం విజయవాడ ఆర్టీసీ పరిపాలన భవనంలోని కార్యాలయంలో ఏపీ ఉపాధి కల్పన, వ్యవస్థాపక సంస్థ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇచ్చిన లక్ష్యాలను శత శాతం పూర్తి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లా స్థాయిలో మార్కెట్‌ అవసరాలకు తగిన విధంగా విధి విధానాలు రూపొందిస్తామన్నారు. సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం.మహేశ్వరరెడ్డి, పలు జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని