logo
Updated : 30/11/2021 06:48 IST

నేను పోలీసును.. ఎస్పీ కార్యాలయం నా చిరునామా


ఎస్పీ కార్యాలయం చిరునామాతో తాకట్టుపెట్టి రూ. 50 వేలు తీసుకున్నట్టు నిందితుడికి ఇచ్చిన రశీదు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ‘గుంటూరులో పాన్‌బ్రోకర్‌ దుకాణం నిర్వహిస్తున్నాను. సెప్టెంబరులో ఒక వ్యక్తి వచ్చి పోలీసునని, తన తల్లికి ఆరోగ్యం బాగోలేదు.. అత్యవసరంగా డబ్బులు కావాలని సాయిబాబా రూపు కలిగిన బంగారు ఉంగరం తాకట్టు పెట్టుకోవాలని అడిగాడు. సుమారు 17 గ్రాముల ఆ ఉంగరంపై హాల్‌మార్కు ముద్ర ఉంది. తల్లి ఆరోగ్యం బాగోలేదనడంతో నమ్మి ఉంగరాన్ని పరిశీలించకుండా రూ. 50 వేలు ఇచ్చాను. చిరునామా అడిగితే ఎస్పీ కార్యాలయం అని రాయించాడు. కొన్ని రోజుల తర్వాత నవరత్నాలు కలిగిన ఉంగరం ఇచ్చి డబ్బులు కావాలని అడిగాడు. పరిశీలించి ఇస్తాను అని చెప్పగా ఉంగరం తీసుకుని కంగారుగా పరారయ్యాడు. అతను మొదట తాకట్టు పెట్టిన ఉంగరాన్ని పరిశీలనకు పంపగా అది వెండికి బంగారు పూత పోసినట్లు తేలింది. అతనికి ఫోన్‌ చేసి అడిగితే దుర్భాషలాడుతూ కేసు పెడతానంటూ భయపెడుతున్నాడు. చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అతను గుంటూరులోని ఒక పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్నాడని తెలిసింది. దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరాను’ అని బాధితుడు తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని