logo
Published : 30/11/2021 06:00 IST

జీజీహెచ్‌, జీఎంసీ అభివృద్ధికి రూ.500 కోట్లు


శిలాఫలకం వద్ద మంత్రులు నాని, సుచరిత తదితరులు

గుంటూరు వైద్యం: సర్వజనాసుపత్రి, గుంటూరు వైద్య కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) వెల్లడించారు. గుంటూరు వైద్య కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నిర్మించనున్న పైలాన్‌కు సోమవారం హోంమంత్రి సుచరితతో కలిసి భూమిపూజ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాడు-నేడు కార్యక్రమం కింద రూ.500 కోట్లు కేటాయించడమే గాకుండా టెండర్లు పిలిచి గుత్తేదారుడికి పనులు అప్పగించామన్నారు. జీజీహెచ్‌లో తొలి దశలో పొరుగు రోగుల విభాగాన్ని సెల్లార్‌, గ్రౌండ్‌, ఏడంతస్తుల భవనాన్ని నిర్మిస్తారన్నారు. పొదిల ప్రసాద్‌ భవనంపై మరో రెండు అంతస్తులు నిర్మిస్తారన్నారు. గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీట్లు 150 నుంచి 250కి పెంచినందున.. అందుకు అనుగుణంగా అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఫిజియాలజీ విభాగాన్ని తొలగించి అక్కడ సెల్లార్‌తో పాటు ఐదంతస్తుల భవనం వస్తుందన్నారు. ఇందులో తరగతి గదులతో పాటు డిజిటల్‌ గ్రంథాలయం, ప్రయోగశాలలు, పరీక్ష గదులు రానున్నాయన్నారు. వీటితో పాటు బాలుర, బాలికల వసతిగృహాల్లో వైద్య విద్యార్థులకు, హౌస్‌సర్జన్లకు, విద్యార్థి వైద్యులకు, సీనియర్‌ రెసిడెంట్లకు 12 భవనాలు విడివిడిగా వస్తాయన్నారు. సర్వజనాసుపత్రిలో జింకాన సాయంతో నిర్మించనున్న మాతాశిశు సంరక్షణ కేంద్రం పనులు త్వరలోనే ప్రారంభమయ్యేలా చూస్తానన్నారు. ఐదు జిల్లాల నుంచి వస్తున్న రోగులకు జీజీహెచ్‌లో మెరుగైన చికిత్స అందుతోందన్నారు. త్వరలో నిర్వహించే ప్లాటినం జూబ్లీ వేడుకలను అందరికీ గుర్తుండేలా నిర్వహిస్తామని, దీనికి ముఖ్యమంత్రి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీనా, ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు గిరిధరరావు, మహమ్మద్‌ ముస్తఫా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ సీతారామాంజనేయులు, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, జేసీ రాజకుమారి, డీఎంఈ రాఘవేంద్రరావు, ప్రిన్సిపల్‌ పద్మావతిదేవి తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని