logo
Published : 30/11/2021 06:00 IST

గుంటూరు ఆసుపత్రిపై హక్కుల కమిషన్‌ గుర్రు

వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి, గుంటూరు కలెక్టర్‌కు నోటీసులు

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: గుంటూరు జిల్లా ఈనాడు పత్రికలో ‘మనుషులకు విలువ లేదా ఇక్కడ’ శీర్షికన ఈనెల 28న ప్రచురితమైన కథనానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నరాల సంబంధిత వ్యాధితో నడవలేని స్థితిలో వచ్చిన పిడుగురాళ్లకు చెందిన అన్నపూర్ణమ్మను ఆమె కుమారుడు భుజాలపై ఎత్తుకుని వైద్యుల వద్దకు తీసుకెళ్లారని, రోగులను తరలించే చక్రాల కుర్చీల్లో దుప్పట్లు, మందుల బాక్సులు పెట్టారన్నది కథన సారాంశం. ఈ కథనాన్ని చదివి స్పందించిన మానవ హక్కుల రాష్ట్ర కమిషన్‌ ఛైర్మన్‌ మాంధాత సీతారామమూర్తి, జ్యుడీషియల్‌ సభ్యులు సుబ్రహ్మణ్యం ఈ కేసును స్వచ్ఛందం (సుమోటా)గా స్వీకరించారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్‌, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌, డీఎంహెచ్‌వోలకు నోటీసులు జారీ చేసినట్లు విభాగపు అధికారి బొగ్గరం తారక నరసింహకుమార్‌ సోమవారం తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని