logo
Updated : 30/11/2021 06:45 IST

స్పందన అర్జీలకు సకాలంలో పరిష్కారం

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీలు రాజకుమారి, దినేష్‌కుమార్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అర్జీదారులు తరలివచ్చారు. రెండు వారాలుగా ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించలేదు. దీంతో సోమవారం 277 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌తో పాటు, జేసీలు దినేష్‌కుమార్‌, జి.రాజకుమారి, అనుపమ అంజలి, డీఆర్‌వో పి.కొండయ్య ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సక్రమంగా సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను కూడా సత్వరం పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఓటీఎస్‌ నుంచి మినహాయించరూ..!

ప్రభుత్వం కట్టించి ఇచ్చిన ఇళ్లకు తమకు మినహాయింపు ఇవ్వాలని పులిచింతల ముంపు ప్రాంత ఆర్‌అండ్‌ఆర్‌ పెదపాలెం గ్రామస్థులు కోరుతున్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో గ్రామస్థులు బాణావత్‌ బీకూనాయక్‌, నున్నావతు నరసింహానాయక్‌, ముడావతు వెంకటేశ్వర్లు నాయక్‌, కుంభా శ్రీను తదితరులు అధికారులకు అర్జీ అందించారు. ముంపు ప్రాంతం నుంచి భూమిని ప్రభుత్వానికి ఇచ్చి బయటకు వచ్చిన తమకు ప్రభుత్వం అన్నీ ఉచితంగా ఇస్తానని చెప్పి అప్పట్లోనే ఇళ్లు కట్టించిందన్నారు. తమకు పరిహారం చెక్కులను ఇచ్ఛి. ఖాతా నుంచి డబ్బులు ఇవ్వకుండా ఇప్పటికీ తిప్పుతున్నారన్నారు. పరిహారం నేటికీ చెల్లించకపోగా.. ఇప్పుడు ఓటీఎస్‌ కింద డబ్బులు చెల్లించమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమను ఓటీఎస్‌ పథకం నుంచి మినహాయించాలని కోరారు.

డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు 14 ఫిర్యాదులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి 14 మంది తమ ఫిర్యాదులను ఫోన్‌ ద్వారా నేరుగా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కు విన్నవించుకున్నారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రజల ఫిర్యాదులను నేరుగా విని ఆయా శాఖల అధికారులను సమస్యలు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జి.రాజకుమారి, అనుపమ అంజలి, డీఆర్‌వో పి.కొండయ్య పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని