logo
Published : 30/11/2021 06:00 IST

మా పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించండి

పాఠశాల కమిటీ సభ్యులు సాల్మన్‌రాజు, ప్రవల్లిక

రిలోని పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ పాఠశాల కమిటీ సభ్యులు సాల్మన్‌రాజు, ప్రవల్లిక సోమవారం ‘స్పందన’లో అధికారులకు విన్నవించుకున్నారు. వారు మాట్లాడుతూ.. చుండూరు మండలం మైదుకూరు ఎస్సీకాలనీలో ఉన్న పాఠశాలలో 70 మంది విద్యార్థులకు ప్రస్తుతం ఒక్కరు మాత్రమే ఉన్నారన్నారు. ఉన్న ఒక్కరు ప్రభుత్వం సూచించిన కార్యక్రమాలతో హడావుడిగా గడిపేస్తున్నారని, ఇక పిల్లలకు బోధన అంతంతమాత్రంగానే ఉందన్నారు. ఆంగ్ల మాధ్యమం ఉందని ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ బడికి పంపుతున్న సమయంలో ఉపాధ్యాయులు లేక తమ పిల్లల చదువులు ఆందోళనకర పరిస్థితికి వస్తున్నాయని కమిటీ సభ్యులు, గ్రామస్థులు వాపోయారు. అధికారులు తమ కాలనీలోని పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని