logo
Published : 30/11/2021 06:17 IST

అనుమానమే... నిజమైంది...

కోడలిని చంపిన అత్తామామ, బంధువులు
అనుమానాస్పద మృతిని ఛేదించిన పోలీసులు

షేక్‌ మహినీషా (పాత చిత్రం)

పొన్నూరు, న్యూస్‌టుడే: మృతురాలి తల్లిదండ్రుల అనుమానమే నిజమైంది. 6 నెలల గర్భవతి అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలీసులు లోతుగా విచారించారు. చివరకు హత్య చేశారని నిర్ధారించి నిందితులను అదుపులోకి తీసుకున్న ఘటన పొన్నూరు పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. అర్బన్‌ పోలీసుల కథనం ప్రకారం పొన్నూరు పట్టణం నిడుబ్రోలు క్యాబిన్‌పేటకు చెందిన షేక్‌ మహినీషా (21), 16వ వార్డు నేతాజీనగర్‌కు చెందిన షేక్‌ షమీమ్‌లు ప్రేమించి వివాహం చేసుకున్నారు. షమీమ్‌ తల్లిదండ్రులకు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. కోడలు షేక్‌ మహినీషాను అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేశారు. మామ షేక్‌ ఖాజావలి, అత్త షేక్‌ షాహీనా కోడలిని చంపేందుకు కుట్రపన్నారు. ఇందుకు సమీప బంధువులు షేక్‌ బషీర్‌, షేక్‌ షాజహాన్‌లను సంప్రదించి హత్యకు సహకరించాల్సిందిగా కోరారు. ఆగస్టు 6న ఇంట్లో మహినీషా నిద్రిస్తున్న సమయంలో షేక్‌ బషీర్‌, షేక్‌ ఖాజావలి, షేక్‌ షాహీనా, షేక్‌ షాజహాన్‌లు కలిసి ఆమె తలభాగంపై దిండు గట్టిగా అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఈ విషయం బయటకు రానీయకుండా మూర్ఛవ్యాధితో కిందపడిపోయిందని కుటుంబ సభ్యులను నమ్మించి ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రైవేటు వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మహనీషా మృతిపై తల్లిదండ్రులకు అనుమానాలు తలెత్తడంతో అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సీఐ శరత్‌కుమార్‌ దర్యాప్తు చేపట్టారు. పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలలో శవ పంచనామా నిర్వహించారు. శవపంచనామలో మృతురాలికి ఊపిరి ఆడకపోవడం వల్లే మృతి చెందిందని నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికను పరిశీలించిన సీఐ శరత్‌కుమార్‌ తనదైన శైలిలో విచారణ చేపట్టారు. ఆ విచారణలో కొన్ని విషయాలు వెలుగులోకి రావడంతో మృతురాలి అత్తామామ, బంధువులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఆ విచారణలో మహినీషాని తామే చంపినట్లుగా ఒప్పుకున్నారు. నలుగురిపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ పి.శరత్‌బాబు తెలిపారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన అర్బన్‌ పోలీసులను బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని