logo
Published : 30/11/2021 06:31 IST

రక్షించలేక తొలగిస్తున్నా

పంట ఏపుగా పెరిగింది. కాయలు బాగున్నాయి.. సంక్రాంతికి తొలి కోత కోసి ఎకరాకు 20-25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకున్నాం. రోడ్డు పక్కనే ఉండటంతో తోట బాగుందని ఈ మార్గాన వెళ్లేవారందరూ చెప్పుకునేవారు. 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వేళ్లు కుళ్లిపోయి మొక్కలు వడలిపోయాయి. వర్షం తగ్గిన క్రమంలో బతికించుకుందామని అనుకుంటే తామరపురుగు ఆశించి పూత, పిందెను తొలిచేసింది. చెట్టు నిండా పిందెలు కనిపిస్తున్నా రోజురోజుకూ తోట నాశనమవుతోంది. పచ్చికాయ కోసి అమ్ముదామన్నా కోత కూలీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు రూ.2300లు ఇచ్చి పంట తొలగిస్తున్నాను. మొత్తం ఏడెకరాలు ఎకరా రూ.30వేలు చొప్పున కౌలు చెల్లించాను. పెట్టుబడి రూపంలో ఎకరాకు రూ.50-60వేలు వెచ్చించాను. తొలి కోతలోనే పెట్టుబడితోపాటు ఎంతో కొంత మిగులు ఉంటుందని ఆశించాను. చివరికి ఒక్క రూపాయి రాకుండానే పంట తొలగింపునకు చేతి నుంచి సొమ్ము చెల్లించాల్సి వస్తోందని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామానికి చెందిన కౌలురైతు తమలపాకుల కోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 7 ఎకరాలు తొలగించి శనగ సాగు చేస్తానని తెలిపారు.

- ఈనాడు, గుంటూరు

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని