logo
Published : 30 Nov 2021 06:31 IST

పోలీసు స్పందనలో ఫిర్యాదుల వెల్లువ

ఫిర్యాదులు నమోదు చేస్తున్న అర్బన్‌ స్పందన సిబ్బంది

నెహ్రూనగర్‌: పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఉద్యోగాల పేరిట మోసగించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ, ఏఎస్పీ గంగాధరం, డీఎస్పీలు అర్జీలు స్వీకరించారు.


రూ. 41.50 లక్షలు స్వాహా - యువకుడు, గుంటూరు

రెడ్డిపాలెంకు చెందిన శరత్‌ పరిచయమై బ్యాంకులో పీవో, సచివాలయంలో, రైల్వేలో టీసీ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షలు చొప్పున నాతోపాటు మరో ఇద్దురు స్నేహితుల వద్ద మొత్తం రూ.41.50 లక్షలు తీసుకొని మోసం చేశాడు.


రైల్వేలో కొలువు ఇప్పిస్తానని.. - బాధితుడు, ఏటీ అగ్రహారం 

నా భార్య ఎంఏ బీఈడీ చదువుకుంది. నా స్నేహితుడి ద్వారా బాబు అనే వ్యక్తి పరిచయమై రైల్వేలో ఉద్యోగం చేస్తున్నానని తెలిపాడు. రూ.9 లక్షలు ఇస్తే తనకున్న పరిచయాలతో రైల్వేలో నా భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని ముందస్తుగా రూ.6.50 లక్షలు తీసుకుని మోసం చేశాడు.


హైకోర్టులో ఉద్యోగాల పేరిట... - బాధితుడు, కనిగిరి 

మా కుమారుడు హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు. వినయ్‌ అనే వ్యక్తి పరిచయమై రూ.రెండు లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తీసుకున్నాడు. ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక పత్రం ఇచ్చాడు. అతని మాటలు నమ్మి ముగ్గురు బంధువులతో డబ్బులు ఇప్పించాం. అతను ఇచ్చిన పత్రాలు నకిలీవని తేలింది.


డ్వాక్రా మహిళల నగదు టోకరా

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ‘గుంటూరు రూరల్‌ జొన్నలగడ్డకు చెందిన తాము (దుర్గమ్మ, వీరమ్మ, శివమ్మ, నాగమణి) డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నాం. ప్రభుత్వం అందిస్తున్న నగదును ఒక మహిళ మాకు తెలియకుండా వాడుకుంటోంది. పొదుపునకు సంబంధించి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము మాకు తెలియకుండా, మా సంతకాలు లేకుండా, సభ్యులు తీర్మానం చేయకుండా ఆమె ఖాతాకు బదలాయించుకుంటోంది. ఇటీవల బ్యాంకు స్టేట్‌మెంట్‌ తీసుకుంటే ఆమె అక్రమాలు బయటపడ్డాయి. పొదుపునకు సంబంధించి ఒక్కో గ్రూపు డబ్బులు రూ.70 వేలు, రూ. 50 ఇలా అనేక గ్రూపు సభ్యుల నగదును బ్యాంకు నుంచి నేరుగా ఖాతాలో జమ చేయించుకుంటోంది. మా సంతకాలు లేకుండా ఆమె ఖాతాకు సొమ్ము మళ్లించడంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ.10 లక్షలు స్వాహా చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ముఖ్యమంత్రికి, కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నామని’ తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని